July 01 2025జులై 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జులై 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్ల పక్షం

తిథి: ఆషాఢ శుద్ధ షష్ఠి మ.2.08 కు తదుపరి సప్తమి 2 మ.3.09 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుబ్బ ఉ.11.22 కు తదుపరి ఉత్తర 2 మ.3.04 కు
యోగం: వ్యతీపాత సా.5:18 కు తదుపరి వరీయాన్ 2 సా.5:46 కు
కరణం: తైతుల ఉ.10.21కు తదుపరి గరజి రా.11.05 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:25-9:17 కు, మ. 11:14-11:58 కు
వర్జ్యం: రా.7.03-8.45 కు
అమృతకాలం: తె.3.15 - 5.00 కు
సూర్యోదయం: ఉ. 5:32కు
సూర్యాస్తమయం: సా. 6:34 కు

🕉️ స్కంద షష్ఠి,, వారాహీ నవరాత్రులు 6వ రోజు🕉️

గురుబోధ:
నేడు కూడా షష్ఠీదేవిని, కుమారస్వామిని వారి దివ్యానుగ్రహం కోసం పూజించవచ్చును.
ఎన్నో వేలజన్మల సంస్కారం, పుణ్యం ఉంటే గాని తీర్థయాత్రలు చేయలేము. పైగా సద్గురువులతో యాత్ర చేసే భాగ్యం మరింత అదృష్టం. అటువంటి పుణ్య ప్రదేశాలలో ఇతరుల పై చాడీలు చెప్పడం, కోపగించుకోవడం, ఏదో ఒక వంక పెట్టి అసంతృప్తి వ్యక్తపరచడం, విరుచుకుపడడం చేయరాదు. సాధ్యమైనంత వరకు ఏదో ఒక నామ, జప, పారాయణం, పురాణ శ్రవణంతో కాలం గడపాలి. తీర్థయాత్రలు చేయడం కుదరనప్పుడు తీర్థయాత్రలు చేసేవారికి ధన,వస్తు రూపములో ఎంతో కొంత సహాయం చేసినవారికి కూడా ఆ తీర్థయాత్రలు చేసిన ఫలితం కొంత వస్తుంది.

షష్ఠీదేవి స్తోత్రము: https://youtu.be/z5AyoV476mQ?si=uLTFHvgm5povIJrZ
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less