"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 24 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణ పక్షము తిథి: సప్తమి తెల్లవారి 05గం౹౹00ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: హస్త ఈ రోజు ఉదయం 09గం౹౹15ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం: సుకర్మ ఉదయం 11గం౹౹12ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹35ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹49ని౹౹ నుండి 03గం౹౹34ని౹౹ వరకు వర్జ్యం: సాయంత్రం 05గం౹౹00ని౹౹ నుండి 06గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 02గం॥17 నుండి 03గం॥49ని॥ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹47ని౹౹ వరకు గురుబోధ: ప్రతినిత్యం ఏదో ఒక దేవతామూర్తికి యథాశక్తి అభిషేకం చేయడం మంచి అలవాటు. ఏదో ఒక భగవన్నామం చెపుతూ నీటితో అభిషేకం చేసి తీర్థం తీసుకున్నా, ఆ తీర్థం ఇంటిలోని వారికి సకల శుభాలు ప్రసాదిస్తుంది.