January 18 2022జనవరి 18 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 18 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   ఉత్తరాయణం   హేమంత ఋతువు 
   పుష్యమాసం కృష్ణ పక్షము

తిథి: పాడ్యమి (19) తెల్లవారి  06గం౹౹10ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  పుష్యమి తెల్లవారి 06గం౹౹27ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం: విష్కoభ సాయంత్రం 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం  : బాలవ  ఈ రోజు సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹44ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹51ని౹౹ నుండి 11గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 01గం౹౹06ని౹౹ నుండి 02గం౹౹50ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి  11గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹41ని౹౹ వరకు 

గురుబోధ:

ఏదైనా వ్యక్తి మరణిస్తే బంధువులకు 10, 3 లేదా 1  రోజు మృతాశౌచం ఉంటుంది.  ఈ అశౌచ సమయములో అదే  ఇంటిపేరు గల మరొక వ్యక్తి  మరణిస్తే మళ్ళీ అశౌచం పాటించాల్సిన అవసరం లేదని శాస్త్రం. మొదటి అశౌచం పూర్తి అయ్యాక చేసే శుద్ధి స్నానం తో రెండవ అశౌచం కూడా కలిసిపోతుంది.  జాతా శౌచముకు కుడా అదే నియమం. 
- శ్రీ గరుడపురాణం
expand_less