"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 12 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షము తిథి: దశమి ఈ రోజు సాయంత్రం 06గం౹౹29ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం: భరణి ఈ రోజు సాయంత్రం 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి కృత్తిక యోగం: సాధ్య ఉదయం 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి శుభ కరణం : గరజి ఈ రోజు సాయంత్రం 04గం౹౹49ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹48ని౹౹ నుండి 12గం౹౹32ని౹౹ వరకు & వర్జ్యం: తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 05గం౹౹14ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 10గం౹౹58ని౹౹ నుండి 12గం౹౹41ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹38ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹40ని౹౹ వరకు గురుబోధ: వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి* శివకేశవుల ఇరువురికి ప్రీతికరం. ఆ నాడు ఉత్తర ద్వార దర్శనం చాలా ముఖ్యమైనది. ఈ రోజున విష్ణువు ఉత్తర ద్వారం గుండా వచ్చి దేవతలను, ఆయనని నమ్మి ఉపాసన చేసిన వారిని రక్షిస్తాడు మఱియు ఇహలోకంలో ఋణ విముక్తి, భూ అభివృద్ధి అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. కుటుంబం అభివృద్ధి అవుతుంది. మోక్షం వస్తుంది. ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే ఏవైనా సహస్ర నామాలను పారాయణ చేసుకోవాలి. అలా చేస్తే అన్ని దోషాలు తొలగుతాయి.