"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 07 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : ఏకాదశి రా. 09గం౹౹14ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : విశాఖ రా. 07గం౹౹19ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం : ధృతి ఉ. 06గం౹౹10ని౹౹ వరకు తదుపరి శూల
కరణం : బవ మ. 12గం౹౹50ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹24ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹10ని౹౹ నుండి 11గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹37ని౹౹కు
👉🕉️ మార్గశిర కృష్ణ ఏకాదశి 🕉️👈
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయాలి.
గురుబోధ
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు. ఏకాదశి రోజు జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనము చేసుకున్నవాడు జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాటవరుసకి కూడా దౌర్భాగ్యం పొందడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
గమనిక
లోకకళ్యాణార్థం పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ఆదేశానుసారం సామూహిక కాత్యాయనీ వ్రతం భాగ్యనగర అరుణాచలేశ్వరుని సన్నిధిలో జనవరి 7 (ఆదివారం) సాయంత్రం 4 గం.ల నుండి 6 గం.ల 30 ని.ల వరకు జరుగుతుంది.