January 01 2022జనవరి 01 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  జనవరి 01 2022🌟
     శ్రీ ప్లవనామ సంవత్సరం
   దక్షిణాయనం   హేమంత ఋతువు 
   మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము

తిథి: చతుర్దశి ఈ రోజు రాత్రి 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : శనివారం (శనివారం)
నక్షత్రం:  జ్యేష్ఠ ఈ రోజు రాత్రి 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి మూల
యోగం: గండ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం  : వణిజ  ఈ రోజు ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹30ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹14ని౹౹ నుండి 08గం౹౹02ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 01గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు 
అమృతకాలం: ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు 

👉🏻🕉️మాస శివరాత్రి🕉️

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి జన్మదిన సందర్భంగా లోకకళ్యాణార్థం మహన్న్యాసపూర్వక   సహస్రలింగార్చన(1000 పార్థివలింగములు తయారు చేసి అభిషేకం) మరియు భగవద్గీత, సుందరకాండము, దుర్గాసప్తశతి, లలితావిష్ణు సహస్ర నామముల పారాయణము హైదరాబాద్ లో ప్రణవపీఠ శిష్యబృందం
నిర్వహిస్తున్నది.

గురుబోధ:

గొడుగు, చెప్పులు, వస్త్రము, ఉంగరం, కమండలము, ఆసనము, పాత్ర, భోజ్య పదార్థాలు - ఈ ఎనిమిది పదము  అనబడతాయి.

శ్రీ గరుడపురాణం(ధర్మ కాండము,అ.4)
expand_less