"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 01 2022🌟 శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణ పక్షము తిథి: చతుర్దశి ఈ రోజు రాత్రి 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి అమావాస్య వారం : శనివారం (శనివారం) నక్షత్రం: జ్యేష్ఠ ఈ రోజు రాత్రి 06గం౹౹32ని౹౹ వరకు తదుపరి మూల యోగం: గండ ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి వృద్ధి కరణం : వణిజ ఈ రోజు ఉదయం 07గం౹౹17ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹30ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 07గం౹౹14ని౹౹ నుండి 08గం౹౹02ని౹౹ వరకు వర్జ్యం: రాత్రి 01గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం: ఉదయం 10గం౹౹20ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹35ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹32ని౹౹ వరకు 👉🏻🕉️మాస శివరాత్రి🕉️ పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి జన్మదిన సందర్భంగా లోకకళ్యాణార్థం మహన్న్యాసపూర్వక సహస్రలింగార్చన(1000 పార్థివలింగములు తయారు చేసి అభిషేకం) మరియు భగవద్గీత, సుందరకాండము, దుర్గాసప్తశతి, లలితావిష్ణు సహస్ర నామముల పారాయణము హైదరాబాద్ లో ప్రణవపీఠ శిష్యబృందం నిర్వహిస్తున్నది. గురుబోధ: గొడుగు, చెప్పులు, వస్త్రము, ఉంగరం, కమండలము, ఆసనము, పాత్ర, భోజ్య పదార్థాలు - ఈ ఎనిమిది పదము అనబడతాయి. శ్రీ గరుడపురాణం(ధర్మ కాండము,అ.4)