Jan 31 2026జనవరి 31 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 31 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి ఉ.7.42 కు తదుపరి చతుర్దశి 01 తె.5.52 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పునర్వసు రా.1.47 కు తదుపరి పుష్యమి 01 రా.12.48 కు
యోగం: ప్రీతి ఉ.10:18 కు తదుపరి ఆయుష్మాన్ 01 ఉ.7:20 కు
కరణం: గరజి రా.7:07 కు తదుపరి విష్టి 01 సా.4:43 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.22 - 9.07 కు
వర్జ్యం: మ.2.26 - 3.56 కు
అమృతకాలం: రా. 11.20 - 12.48 కు
సూర్యోదయం: ఉ. 6.52 కు
సూర్యాస్తమయం: సా. 6.06 కు

🕉️ శనిత్రయోదశి, ఏలూరులో శ్రీ ప్రణవపీఠంలో 13వ వార్షికోత్సవాలు🕉️

గురుబోధ:
https://youtu.be/O_YNroZ9NsE
⚡ శనివారం త్రయోదశి వస్తే దానిని శనిత్రయోదశి అంటారు. ఆ రోజు శనైశ్చరునికి, హనుమంతునికి లేదా గణపతికి చేసే పూజల వల్ల శని అనుగ్రహం పొంది కష్టాల నుండి త్వరగా బయట పడుతారు
⚡ శనైశ్చరుడు సాక్షాత్ సూర్యభగవానుని పుత్రుడు, కరుణా స్వరూపుడు. కాశీలో గొప్ప తపస్సు చేసి శివ అనుగ్రహంతో గ్రహాధిపతి అయ్యాడు. ధర్మప్రియుడు. అధర్మం చేసేవారిని శిక్షిస్తాడు.
⚡ నిత్యం నవగ్రహ ప్రదక్షిణ ఎంతో మంచిది. నవగ్రహాలనూ ఎప్పుడూ తక్కువ చేయరాదు. వారు గొప్ప తపస్సు చేసి గ్రహాధిపత్యం పొందారు. కేవలం శనికి తైలాభిషేకం చేస్తే తప్ప నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయ్యాక కాళ్లు కడుక్కోవడం ఏ శాస్త్రం లో చెప్పలేదు.
⚡దేవాలయాల్లో మూర్తులకు ముఖ్యంగా శనైశ్చరునికి ఎదురుగా నిలబడరాదు. ప్రక్కనుండి మాత్రమే నమస్కారం చెయాలి.
⚡ సిందూరం లేదా తమలపాకులతో హనుమంతుని పూజించడం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం, బెల్లం నువ్వులు నైవేద్యం పెట్టడం, నల్లని వస్త్రం ఇవ్వడం మరియు నిత్యం ఈ శ్లోక పారాయణ వల్ల శుభ ఫలితాలు పొందుతాం.
శ్లో|| కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్టా ప్రసారిణం ఛాయా  మార్తాండ  సంభూతం, నమస్యామి శనైశ్చరం
శనిప్రదోషం - శివ పూజా ఫలితం!
⚡ప్రదోష సమయంలో శివ దర్శనం, అభిషేకము చాలా విశేషం. సకల కోరికలు తీరుతాయి.
⚡శనిప్రదోష పూజా ఫలితంగా శ్రీ అనసూయ అత్రి మహర్షికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు; శ్రీ సుమతి, శ్రీ అప్పలరాజులకి శ్రీ పాద శ్రీ వల్లభులు జన్మించారు.
ఈ రోజు నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
⚡ గాణగాపురం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు కూడా శనిప్రదోష పూజా ఫలితంగా వారి తల్లిదండ్రులకు జన్మించారు.
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం👇
https://youtu.be/97Q4_4k_hH4?si=ZrxR8HLZ8tWhhP77
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
https://youtu.be/41P8HbBhQAs?si=I8piaWgDoTC4asIB
ఏలినాటి శని తొలగించే కథ👇
https://youtu.be/DZTHb0mK6hM?si=U87crLSe9heMKRpa

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less