"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 31 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : పంచమి ఉ. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి షష్ఠి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం : హస్త రా. 10గం౹౹08ని౹౹ వరకు తదుపరి చిత్త యోగం : సుకర్మ ఉ. 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : తైతుల ఉ. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : మ. 12గం౹౹07ని౹౹ నుండి 12గం౹౹52ని౹౹ వరకు వర్జ్యం : తె. 05గం౹౹16ని౹౹ నుండి 06గం౹౹46ని౹౹ వరకు అమృతకాలం : మ. 03గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు గురుబోధ ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. ఈ సృష్టిలో మొత్తము 7 కోట్ల రకాల వృక్షజాతులు 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములన్నియు స్వర ప్రధానములు, ఉచ్చారణ అక్షర దోషాలు లేకుండా చెయ్యాలి. భూలోకంలో ఉన్న మానవుల యొక్క ముఖ యంత్రములలోని లోపాల వల్ల కొంతమంది మంత్ర ఉచ్చారణ సరిగ్గా చేయలేరు అందుకని అమ్మవారు ఈ 7 కోట్ల మంత్రములను 7 కోట్ల వృక్షజాతులుగా సృష్టించింది. మంత్ర అనుష్ఠాన ఫలితమును చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా పొందవచ్చును.