Jan 30 2026జనవరి 30 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 30 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి ఉ.9.52 కు తదుపరి త్రయోదశి 31 ఉ.7.42 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆర్ద్ర 31 తె.3.04 కు తదుపరి పునర్వసు 31 రా.1.47 కు
యోగం: విష్కంభ మ.1:33 కు తదుపరి ప్రీతి 31 ఉ.10:18 కు
కరణం: బాలవ ఉ.11:09 కు తదుపరి కౌలవ రా.9:47 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 9.07 - 9.52 కు, మ. 12.51 - 1.36 కు
వర్జ్యం: ప.12.25 - 1.55 కు
అమృతకాలం: సా. 06.18 - 07.46 కు
సూర్యోదయం: ఉ. 6.52 కు
సూర్యాస్తమయం: సా. 6.06 కు

🕉️ మహాప్రదోషము, ఏలూరులో శ్రీ ప్రణవపీఠంలో 3 రోజుల పాటు 13వ వార్షికోత్సవాలు ప్రారంభం🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం 9.30 లోపు చేసేయాలి.

గురుబోధ:
ప్రదోషసమయం (సాయంసంధ్య) లో శివారాధన, శివపూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది. మహాభారతం ఆనుశాసనిక పర్వంలో ఉండే వేదాలు, ఉపనిషత్ సారమైన అత్యద్భుత స్తోత్రం శివసహస్రనామ స్తోత్రం. ఇది మానసిక, శారీరిక ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాక స్వర్గాన్ని సైతం ప్రసాదిస్తుంది. ఒక సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా, వాళ్ళు అశ్వమేథయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇
https://youtu.be/AcS0VMMx3lU?si=FLFDyTgKtHOvxyPv
పిడిఎఫ్ - https://srivaddipartipadmakar.org/stotram/sri-siva-sahasranama-stotram/

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less