"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 30 2024 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : పంచమి పూర్తిగా ఉంది వారం : భౌమవారము (మంగళవారం) నక్షత్రం : ఉత్తర రా. 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : అతిగండ ఉ. 10గం౹౹43ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : బాలవ ఉ. 08గం౹౹54ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ వరకు & రా. 11గం౹౹14ని౹౹ నుండి 12గం౹౹04ని౹౹ వరకు వర్జ్యం : తె. 05గం౹౹01ని౹౹ నుండి 06గం౹౹31ని౹౹ వరకు అమృతకాలం : ఉ. 11గం౹౹48ని౹౹ నుండి 01గం౹౹34ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹కు సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు గురుబోధ శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్ర వారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు. ఉత్తములు, సదాచారాలు పాటించేవారు మఱియు భగవత్ భక్తులతో స్నేహం వల్ల వారి సద్గుణాలు మనకు అలవడుతాయి. ఆ సత్సంగం మన జీవితాన్ని మారుస్తుంది.