" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 30 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము తిథి : నవమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి దశమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : కృత్తిక రాత్రి 01గం౹౹29ని౹౹ వరకు తదుపరి రోహిణి యోగం : శుక్ల ఉదయం 10గం౹౹49ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ కరణం : కౌలవ ఉదయం 10గం౹౹11ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹22ని౹౹ వరకు & 02గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹36ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 01గం౹౹03ని౹౹ నుండి 02గం౹౹42ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 10గం౹౹59ని౹౹ నుండి 12గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹ గురుబోధ మంత్రోపదేశం చేసినవారు మాత్రేమే గురువు.(తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రేమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ప్రతిరోజూ లేవగానే భగవత్ ధ్యానం, గురు ధ్యానం చేసుకొంటూ రోజును ప్రారంభించవలెను. అనునిత్యం గురువు ఇచ్చిన మంత్రం జపించుకోవడం వలన మంత్రదేవత, గురువు యొక్క కృపతో సకలశుభాలు పొందుతారని గురుగీత, సకల పురాణాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. శ్యామలా నవరాత్రులలో ఆఖరురోజు. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి అమ్మవారి పటాన్ని కాని, విగ్రహం కాని పూజా మందిరంలో పెట్టుకుని 9 రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదన చేయండి. అలా చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. స్త్రీలకు, పురుషులకు అప్పటికి పెళ్ళి అయిన వారికి ఐకమత్యం పెరుగుతుంది. వార్థక్యంలో ఉన్నవారు వైధవ్యాలు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు. కుటుంబ వృద్ధి, ధనధాన్యవృద్ధి అవుతుంది. అకాలమరణాలు ఉండవు.