కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 29 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా.6.55 కు తదుపరి పాడ్యమి 30 సా.6.01 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.06 కు తదుపరి శ్రవణం 30 ఉ.8.49 కు
యోగం: సిద్ధి రా.8:21 కు తదుపరి వ్యతీపాత 30 సా.06.33 కు
కరణం: చతుష్పాద ఉ. 6:54 కు తదుపరి నాగ సా.6.05 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.06 - 12.51 కు
వర్జ్యం: మ.1.07 - 2.41 కు
అమృతకాలం: ప. 11.05 - 12.29 కు
సూర్యోదయం: ఉ. 6:38 కు
సూర్యాస్తమయం: సా. 5:48 కు
🕉️చొల్లంగి అమావాస్య🕉️
గురుబోధ:
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
సకలపాపాలను తొలగించే పవిత్ర మాసం మాఘమాసం. మాఘం ఇంత అమోఘం అవ్వడానికి గల కారణాలను శ్రీమద్ధేవీభాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ వేదవ్యాసుడు వివరించాడు. అఘం అంటే పాపం. దానిని తొలగించేదే మాఘం.