Jan 29 2024జనవరి 29 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 29 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : చతుర్థి  పూర్తిగా ఉంది
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : పుబ్బ సా. 05గం౹౹12ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం : శోభన ఉ. 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం :  బవ రా. 07గం౹౹31ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹52ని౹౹ నుండి 01గం౹౹37ని౹౹ వరకు & మ. 03గం౹౹08ని౹౹ నుండి 03గం౹౹53ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹10ని౹౹ నుండి 02గం౹౹56ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹06ని౹౹ నుండి 11గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹37ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹కు

👉🕉️ సంకష్టహర చతుర్థి 🕉️👈

గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు.

శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇

🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది. 
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపదమాసంలో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.

శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇

🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆విడిచిపెట్టకుండా ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి. 
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.

expand_less