Jan 29 2023జనవరి 29 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 29 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : అష్టమి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹59ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం :  భరణి రాత్రి 12గం౹౹37ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : శుభ  ఉదయం 11గం౹౹05ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  బాలవ ఈ రోజు రాత్రి 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹21ని౹౹ నుండి 05గం౹౹06ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 10గం౹౹02ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹22ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹50ని౹౹

🕉️👉 భీష్మాష్టమి👈🕉️

గురుబోధ
ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మ తర్పణం, అర్ఘ్యం మాత్రము(తల్లి తండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే. 

వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹
గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹
అపుత్రాయ జలంధద్మి ౹ నమో భీష్మవర్మణే ౹౹
భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹
అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹

తర్పణ క్రమః

1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం
   తర్పయామి -  3 సార్లు
2. ఆజన్మ బ్రహ్మచారిణం  అపుత్రాయ భీష్మవర్మాణం 
  తర్పయామి - 3సార్లు
3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం
భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు

ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.

 శ్లో.  వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹ 
అర్ఘ్యం దదామి భీష్మాయ  ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹

ఇతిభీష్మ తర్పణ విధిః

expand_less