Jan 27 2024జనవరి 27 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 27 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : విదియ  రా. 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఆశ్లేష మ. 12గం౹౹08ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం : ఆయుష్మాన్ ఉ. 08గం౹౹09ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :  తైతుల మ. 02గం౹౹25ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : తె. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹22ని౹౹ నుండి 03గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹49ని౹౹కు

గురుబోధ
పూజ, వ్రతం వంటివి చేస్తున్నప్పుడు మనం ఆచమనం చేసే పాత్ర లోని నీళ్ళని (పంచపాత్ర లేదా నీళ్ళచెంబు) దేవతలకు వినియోగించరాదు.  విడిగా దేవతలకు ఇంకొక పాత్రను వినియోగించాలి. తెలియక ఆచమనం చేసిన పాత్రనే నైవేద్యంకు ఉపయోగిస్తుంటారు. అలా చేయరాదు.

expand_less