కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 25 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: సప్తమి రా.9.10 కు తదుపరి అష్టమి 26 రా.7.06 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రేవతి మ.12.16 కు తదుపరి అశ్విని 26 ఉ.10.58 కు
యోగం: సాధ్య ఉ.9:11 కు తదుపరి శుభ 26 ఉ.6:19 కు
కరణం: గరజి ఉ.11:58 కు తదుపరి వణిజ రా.11:10 కు
రాహుకాలం: సా. 4.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.34 - 5.18 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 11.13 - 12.47 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 6.03 కు
🕉️ రథసప్తమి, నర్మదా జయంతి, బ్రహ్మసావర్ణిక మన్వాది🕉️
గురుబోధ:
రథసప్తమి నాడు ఆవుపేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవుపాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆ ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు. నేడు ఖచ్చితంగా శ్రీ మార్కండేయ పురాణాంతర్గత ఆదిత్య స్తవం, ఆదిత్య హృదయం శ్రవణం లేదా పారాయణం చెయ్యాలి.
తప్పక చదువవలసిన శ్లోకాలు:
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ ।
తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ॥
ఆదిత్య హృదయం👇
https://youtu.be/oVLM-KRgo2E
ఆదిత్య స్తవం 👇
https://youtu.be/ZNuC8HFPBuU
శ్యామలా దండకం👇
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK
బ్రహ్మసావర్ణి మనువు చరిత్ర👇
https://youtu.be/XGtCclOvSrM?si=l0UcKAp-twfphVrX
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial