Jan 25 2024జనవరి 25 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 25 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : పూర్ణిమ  రా. 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : పునర్వసు ఉ. 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం : విష్కంభ ఉ. 07గం౹౹32ని౹౹ వరకు తదుపరి ప్రీతి
కరణం :  విష్టి ఉ. 10గం౹౹33ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹35ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు & మ. 03గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹52ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹43ని౹౹ నుండి 06గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం : తె.. 03గం౹౹03ని౹౹ నుండి 04గం౹౹46ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

🕉️ గురుపుష్య యోగం, తిరుమల - శ్రీ రామకృష్ణ తీర్థము లో ప్రత్యేక పూజలు 🕉️

గురుబోధ
గురువారం నాడు పుష్యమీ నక్షత్రం కలిసివస్తే దానిని గురుపుష్యయోగంగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీనారాయణలను పూజిస్తే విశేష ధనయోగం లభిస్తుందని చెపుతారు. సకల కోరికలూ నెరవేరతాయి. అమావాస్యతో కలసివచ్చే సోమవారం శివుని పూజకు, శనివారంతో కలసివచ్చే త్రయోదశిని శనిదోషనివారణకు, మంగళవారంతో వచ్చే చతుర్థిని వినాయకుని పూజకు శ్రేష్ఠమైన తిథులుగా చెపుతుంటారు. అటువంటిదే ఈ గురుపుష్యయోగం కూడా. ఆరోజున గురువును పూజించడం, గోసేవ చేయడం గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం చెపుతోంది.
ఈరోజు చేసే ఏ పనైనా అత్యంత శుభఫలితాలను,  కాబట్టి ఎవరైనా కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈరోజు సాయంత్రం 6 గంటల లోపు ప్రారంభిస్తే తప్పకుండా అది మంచి ఫలితాలను ఇస్తుంది ఇటువంటి యోగం చాలా అరుదుగా ఉంటుంది.	

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం👇


expand_less