Jan 24 2024జనవరి 24 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 24 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి  రా. 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఆర్ద్ర ఉ. 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : వైధృతి ఉ. 07గం౹౹40ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం :  గరజి ఉ. 08గం౹౹11ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹06ని౹౹ నుండి 12గం౹౹51ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు
అమృతకాలం : తె.. 05గం౹౹36ని౹౹ నుండి 07గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

గురుబోధ
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క  పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.	

శకుంతల దుష్యంతుల చరిత్ర👇


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్👇


expand_less