కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 23 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి మ.3.23 కు తదుపరి దశమి 24 సా.4.54 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: విశాఖ పూర్తిగా ఉంది తదుపరి అనూరాధ 25 తె.5.34 కు
యోగం: గండ పూర్తిగా ఉంది తదుపరి వృధ్ది 25 తె.5.08 కు
కరణం: గరజి సా.5.38 కు తదుపరి వణిజ 24 ఉ. 6:36 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.36-11.21 కు & మ.3.04-3.48 కు
వర్జ్యం: ఉ.7.15-9.01 కు
అమృతకాలం: ఉ.9.40 - 11.04 కు
సూర్యోదయం: ఉ. 6:38 కు
సూర్యాస్తమయం: సా. 5:46 కు
గురుబోధ:
తపః శక్తి కలిగినవాడికి వార్ధక్యం రాదు. జరా, మరణము పొందకుండా ఉండాలంటే మనము కూడా సాధకులం కావాలి. కొన్ని నియమాలను పాటిస్తే జరామరణాలను జయించవచ్చు. సోమరితనము ఉండకూడదు, సంధ్యా సమయానికి శుచిగా స్నానం చేసి సంధ్యావందనాలు చేయాలి.
శుచి, పవిత్రం అయిన ఆహారము భగవంతుడికి నివేదన చేసి తీసుకోవాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడకుండా మౌనంగా తినాలి అందుకనే దేవతానివేదన కోసం అన్నం వండేటప్పుడు పూర్వం మూతికి గుడ్డ కట్టుకునే వాళ్ళు. ఇతరులను ప్రేమగా చూడటం, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం, ఇతరుల యొక్క దోషాల గురించి చెప్పకపోవడం, అలాగే ఇతరుల దోషాలు వినకపోవడం అనేవి సాధనలో ఉన్నవారు పాటించవలసిన లక్షణాలు.