"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 23 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము
తిథి : త్రయోదశి రా. 08గం౹౹57ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : ఆర్ద్ర పూర్తిగా ఉంది
యోగం : ఐంద్ర ఉ. 08గం౹౹05ని౹౹ వరకు తదుపరి వైధృతి
కరణం : కౌలవ ఉ. 08గం౹౹12ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹50ని౹౹ & రా. 11గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹02ని౹౹
వర్జ్యం : మ. 02గం౹౹40ని౹౹ నుండి 04గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹25ని౹౹ నుండి 10గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు
గురుబోధ
మంగళచండికా స్తోత్రం - యోగం లేక స్వగృహం విడిచిపెట్టి అద్దె ఇళ్ళలో ఉండేవారు 3 మంగళవారములు ఈ స్తోత్రమును దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో వీలైనన్నిసార్లు పారాయణం చేసుకొని, పుణ్యాత్ములకు యథాశక్తి దక్షిణ ఇస్తే వారి స్వగృహం వారికి తిరిగివస్తుంది. పోయిన ఇల్లు మళ్ళీ కొనుక్కునే శక్తి ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం. ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.
శ్రీరాముడు మాంసం తిన్నాడా?👇మంగళచండికా స్తోత్రం👇