"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 22 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము
తిథి : ద్వాదశి రా. 08గం౹౹52ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : మృగశిర 23వ తేదీ తె. 06గం౹౹01ని౹౹ వరకు తదుపరి ఆర్ద్ర
యోగం : బ్రహ్మ ఉ. 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : బవ ఉ. 07గం౹౹36ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹50ని౹౹ నుండి 01గం౹౹35ని౹౹ & మ. 03గం౹౹05ని౹౹ నుండి 03గం౹౹50ని౹౹
వర్జ్యం : ఉ. 11గం౹౹21ని౹౹ నుండి 12గం౹౹59ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹53ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు చేయాలి.
గురుబోధ
రామాయణాన్ని మనకు అందించి రామభక్తి సామ్రాజ్యంలో తరించే భాగ్యం కల్పించిన శ్రీ వాల్మీకి ముని మనకు ప్రాతః స్మరణీయుడు. శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న శుభసమయంలో శ్రీ మద్రామాయణం లో ఒక శ్లోకమో, ఒక ఘట్టమో లేదా రామాయణ ఫలశ్రుతి అయినా విని తరిద్దాం!
పూజ్య గురుదేవుల ఆధ్వర్యవంలో 22వ తేదీ ఉదయం శ్రీ సీతారాముల కల్యాణం దిల్ సుఖ్ నగర్ శ్రీ నారాయణీ గోసాల లో జరుగబోతున్నది.👇
పూజ్య గురుదేవుల ప్రవచనామృతం శ్రీరామావతారం పై 22వ తేదీ సాయంత్రం శ్రీ స్కందగిరి ఆలయం పద్మారావు నగర్ లో జరుగబోతున్నది.👇
శ్రీరామ పట్టాభిషేక సర్గ👇