Jan 22 2023జనవరి 22 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 22 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం శిశర ఋతువు మాఘ మాసం శుక్ల పక్షము

తిథి : పాడ్యమి ఈ రోజు రాత్రి 12గం౹౹56ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భానువారం (అదివారం)
నక్షత్రం :  ఉత్తరాషాఢ ఉదయం 08గం౹౹02ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : వజ్ర ఉదయం 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  కింస్తుఘ్న ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹24ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹16ని౹౹ నుండి 05గం౹౹01ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 11గం౹౹45ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹40ని౹౹ నుండి 10గం౹౹19ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹46ని౹౹

గురుబోధ
మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. పూర్ణిమ, అమావాస్య బ్రహ్మ స్వరూపాలు. శుక్లపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు విష్ణుస్వరూపం. కృష్ణపక్షం పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉన్న 14రోజులు శివస్వరూపం. అందుకే త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుని స్మరణ చేసి పూజిస్తే సర్వశుభప్రదం.



expand_less