Jan 21 2025జనవరి 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 21 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి మ.11.14 కు తదుపరి అష్టమి 22 మ.1.29 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: చిత్త రా.10.30 కు తదుపరి స్వాతి 22 రా.1.03 కు
యోగం: సుకర్మ రా.2:52 కు తదుపరి ధృతి 22 రా.3.49 కు
కరణం: బవ మ.12.40 కు తదుపరి బాలవ 22 రా.2.00 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.9.07-9.51 కు & మ.11.10-12.01 కు
వర్జ్యం: తె.4.39-6.25 కు
అమృతకాలం: మ. 12:27 - 1:51 కు
సూర్యోదయం: ఉ. 6:53 కు
సూర్యాస్తమయం: సా. 6:00 కు

గురుబోధ:
శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్ర వారములు తలస్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.
ఉత్తములు, సదాచారాలు పాటించేవారు మఱియు భగవత్ భక్తులతో స్నేహం వల్ల వారి సద్గుణాలు మనకు అలవడుతాయి. ఆ సత్సంగం మన జీవితాన్ని మారుస్తుంది.

expand_less