Jan 21 2024జనవరి 21 favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 21 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : ఏకాదశి  రా. 09గం౹౹20ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : రోహిణి 22వ తేదీ తె. 05గం౹౹41ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : శుక్ల ఉ. 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి బ్రహ్మ
కరణం :  వణిజ ఉ. 07గం౹౹23ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹35ని౹౹ నుండి 05గం౹౹20ని౹౹
వర్జ్యం : రా. 09గం౹౹43ని౹౹ నుండి 11గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹16ని౹౹ నుండి 03గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

👉🕉️ ఏకాదశి, రైవత మన్వాది 🕉️👈

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ సోమవారం ఉదయం చేయాలి.

గురుబోధ
ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.

ఈ కథను భక్తిశ్రద్ధలతో వింటే జాతకదోషాలు, గ్రహదోషాలు తొలగుతాయి👇
రైవత మనువు చరిత్ర👇


శ్రీ వాసుదేవ శత నామాలు👇


expand_less