కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 20 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం
తిథి: విదియ రా.2.28 కు తదుపరి తదియ 21 రా.2.17 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శ్రవణం మ.1.28 కు తదుపరి ధనిష్ఠ 21 మ.2.07 కు
యోగం: వ్యతీపాత సా.6:58 కు తదుపరి వరీయాన్ 21 సా.5:37 కు
కరణం: బాలవ మ.2:31 కు తదుపరి తైతుల 21 మ.2:48 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 9.07 - 9.51 కు, రా. 11.09 - 12.01 కు
వర్జ్యం: సా.5.34-7.12 కు
అమృతకాలం: తె. 03.11 - 04.51 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 6.00 కు
🕉️ శ్రీ వాసవీమాత అగ్నిప్రవేశం, శ్యామలానవరాత్రులు 2వ రోజు 🕉️
గురుబోధ:
1) సకలపాపాలను తొలగించే పవిత్ర మాసం మాఘమాసం. మాఘం ఇంత అమోఘం అవ్వడానికి గల కారణాలను శ్రీమద్ధేవీభాగవతంలోనూ, బ్రహ్మవైవర్త పురాణంలోనూ వేదవ్యాసుడు వివరించాడు. అఘం అంటే పాపం. దానిని తొలగించేదే మాఘం.
2) మాఘమాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెపుతున్నాయి. మాఘపూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలనీ, మాఘమాసం శుక్ల పక్షంలో పాడ్యమి మొదలుకుని చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణు స్వరూపం. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉండే తిథులు 14 శివ స్వరూపాలు. ఈ కాలంలో వీలున్నంత వరకు సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు. దత్తాత్రేయుడిని కనుక మనము స్మరణ చేస్తే ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. "దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం" అని మార్కండేయ పురాణములో ఒక శ్లోకం ఉన్నది. అలా దత్తాత్రేయుడిని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారు అవుతారు.
3) మాఘమాసం అంతా భక్తిశ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్ధములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మాఘమాసంలో సూర్యోదయానికి కొద్దిగా ముందు సూర్యుడు ఎఱ్ఱగా ఉదయించబోతున్నప్పుడు స్నానం చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.
వాసవీ కన్యకాపరమేశ్వరీ మహిమ
https://youtu.be/3ubkQEcXTSM?si=5K1xQI3avm8iPPyo
శ్యామలా దండకం👇
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial