Jan 20 2024జనవరి 20 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 20 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : దశమి  రా. 10గం౹౹13ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : కృత్తిక 21వ తేదీ తె. 05గం౹౹50ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : శుభ ఉ. 11గం౹౹06ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  తైతుల ఉ. 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹50ని౹౹ నుండి 08గం౹౹20ని౹౹
వర్జ్యం : సా. 06గం౹౹06ని౹౹ నుండి 07గం౹౹39ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹16ని౹౹ నుండి 04గం౹౹50ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

గురుబోధ
పుష్యమాసం యోగులకు ప్రధానమైనది. ఈ మాసంలో యోగాభ్యాసం చేసేవారికి కుండలినీ శక్తి ప్రస్ఫుటమవుతుంది.
శనివారం నువ్వులనూనె శరీరమంతా రాసుకుని స్నానం చేస్తే అష్టమశని ప్రభావం శాశ్వతంగా తొలగిపోతుంది.
శనివారంనాడు నువ్వులనూనెతో శనైశ్చర విగ్రహాన్ని అభిషేకించి, ఆ తైలం కొంచెం కొద్దిగా తీసుకొని, కన్నులు మూసుకొని మన కనురెప్పలపై లేపనంగా రాసుకుంటే నేత్రసంబంధిత పీడలు తొలగిపోతాయి.

మృత సంజీవనీ విద్య👇


పిప్పలాద ప్రోక్త శనిస్తోత్రం👇


expand_less