Jan 20 2023జనవరి 20 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 జనవరి 20 2023 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
ఉత్తరాయనం హేమంత ఋతువు
పుష్యమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి ఈ రోజు ఉదయం 07గం౹౹52ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భృగువారం (శుక్రవారం)
నక్షత్రం : మూల ఉదయం 11గం౹౹13ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : వ్యాఘాత సాయంత్రం 06గం౹౹57ని౹౹ వరకు తదుపరి హర్షణ 
కరణం :  వణిజ ఈ రోజు ఉదయం 09గం౹౹57ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹13ని౹౹ నుండి 09గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹34ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 09గం౹౹42ని౹౹ నుండి 11గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : తెల్లవారి 05గం౹౹13ని౹౹ నుండి 06గం౹౹40ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹39ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹44ని౹౹

మాసశివరాత్రి

గురుబోధ
శివుని ఆలయలంలో ఇచ్చిన పత్రి నందీశ్వరుని మీద పెట్టాలి. ఎందుకంటే శివపత్రిని మోసే శక్తి మనకి లేదు. అది మహా శక్తిమంతమైనది. అందుకే ఈశ్వరుని మీద పెట్టిన బిల్వపత్రమో, దళమో, పుష్పమో మనకిస్తే అవి కళ్ళకద్దుకుని వినయముగా నందీశ్వరుని మీద పెట్టాలి. శివ ప్రసాదాన్ని పొరపాటున కూడా తిరస్కరించకూడదు. కనీసం ఒక్క మెతుకైనా తీసుకోమన్నారు. పండు ఇస్తే, తీర్థమిస్తే కొంచమైనా దానిని స్వీకరించమన్నారు. ఒక్క కొబ్బరికాయ విషయంలో మాత్రం పూర్తిగా అర్చకస్వామిదే బాధ్యత. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ రెండు చిప్పలు అర్చకస్వామివే. ఆయన తనంత తాను ఇస్తేనే మనం పుచ్చుకోవాలి. ఒకవేళ ఇవ్వకుంటే మనం అడిగి తీసుకోకూడదు. తక్కిన ఆలయములలో ఒక చిప్ప మనం అడిగి పుచ్చుకోవచ్చు. - శ్రీ శివమహాపురాణం

expand_less