Jan 19 2026జనవరి 19 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 19 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: శు.పాడ్యమి రా.2.08 కు తదుపరి విదియ 20 రా.2.28 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ మ.12.19 కు తదుపరి శ్రవణం 20 మ.1.28 కు
యోగం: సిద్ధి రా.8:00 కు తదుపరి వ్యతీపాత 20 సా.6:58 కు
కరణం: కింస్తుఘ్న మ.1:51 కు తదుపరి బాలవ 20 మ.2:31 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.48 - 1.33 కు, మ. 3.02 - 3.46 కు
వర్జ్యం: సా.4.30 - 6.11 కు
అమృతకాలం: తె. 02.09 - 03.50 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 6.00 కు

🕉️ మాఘమాసం , శ్యామలానవరాత్రులు ప్రారంభం 🕉️

గురుబోధ:
🕉️ ఆశ్వయుజ మాసం , చైత్రమాసం , ఆషాఢమాసం , మాఘమాసం ఈ నాలుగు మాసాలు చాలా గొప్పవి. మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకుని నవమి వరకు వచ్చేటటువంటి ఈ రాత్రులను శ్యామలానవరాత్రులు అని పిలుస్తారు. ఆ కాలంలో అమ్మవారు శ్యామలాదేవి అనే పేరుతో తిరుగుతుంది. ఈ నవరాత్రుల గురించి దేవీభాగవత మహిమ, మానసోత్తర ఖండంలో, స్కాంద పురాణంలో చెప్పబడింది.
🕉️ అమ్మవారికి ఉన్న చాలా రూపాలలో ఒక రూపం శ్యామలాదేవి. ఈవిడ ఇంచుమించుగా మరకతమనేటటువంటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
🕉️ శ్యామలానవరాత్రులలో ఆకుపచ్చరంగులో ఉండేటటువంటి అమ్మవారి పటాన్ని కాని, విగ్రహం కాని పూజా మందిరంలో పెట్టుకుని 9 రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదన చేయండి. అలా చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. స్త్రీలకు, పురుషులకు అప్పటికి పెళ్ళి అయిన వారికి దాంపత్యంలో ఐకమత్యం పెరుగుతుంది. వార్థక్యంలో ఉన్న వారు వైధవ్యాలు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు. కుటుంబవృద్ధి, ధనధాన్యవృద్ధి అవుతుంది. అకాలమరణాలు ఉండవు. ఈ నవరాత్రులు అత్యంత శుభఫలితాలు ఇస్తాయి.

శ్యామలా దండకం👇
https://youtu.be/zGlmVMlrIsw?si=GhFrtzDf3QHoulCK

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less