కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 19 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి ఉ.7.05 కు తదుపరి షష్ఠి 20 ఉ.9.09 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఉత్తర సా.5.21 కు తదుపరి హస్త 20 రా.7.50 కు
యోగం: శోభన రా.1:15 కు తదుపరి అతిగండ 20 రా.1:57 కు
కరణం: తైతుల ఉ. 7:31 కు తదుపరి గరజి రా. 8:42 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.31-5.15 కు
వర్జ్యం: రా.2.37-4.23 కు
అమృతకాలం: మ. 3:13 - 4:37 కు
సూర్యోదయం: ఉ. 6:53 కు
సూర్యాస్తమయం: సా. 6:00 కు
గురుబోధ:
మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను సంరక్షించడం ఎంతో పుణ్యప్రదం. వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడము వల్ల దేవతలు ప్రీతిచెందుతారు. శుభాలు కలిగిస్తారు.