కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 18 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: అమావాస్య రా.1.17 కు తదుపరి శు.పాడ్యమి 20 రా.2.08 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.10.41 కు తదుపరి ఉత్తరాషాఢ 19 మ.12.19 కు
యోగం: వజ్ర రా.8:45 కు తదుపరి సిద్ధి 19 రా.8:00 కు
కరణం: చతుష్పాద మ.12:46 కు తదుపరి కింస్తుఘ్న 19 మ.1:51 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.30 - 5.14 కు
వర్జ్యం: రా.7.13 - 8.56 కు
అమృతకాలం: తె. 05.01 - 06.43 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.59 కు
🕉️ పురందరదాసులవారి ఆరాధన, చొల్లంగి అమావాస్య, యోగి వేమన జయంతి, పద్మకయోగము🕉️
గురుబోధ:
🕉️పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
🕉️దానంతో సమానమైన పుణ్యం మరొకటిలేదు. మహాపాతకాలన్నీ దానం వల్ల తొలగిపోతాయి. పూజలన్నిటికి పరమార్ధం దానం చేయడమే. భగవంతుడికి మనం ఇచ్చే ప్రతి పైసా తిరిగి వెనక్కి వస్తూనే ఉంటుంది.
🕉️ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. స్నానం చేసిన తరువాత ఒక పెద్ద రాగి గిన్నె కానీ, ఇత్తడి గిన్నె కానీ, కంచు గిన్నె కానీ లేదా మట్టి మూకుడు కానీ పెట్టుకుని అందులో నిండా నీళ్లు తీసుకోండి, ఆ నీటిలో ఎర్రని పూలు, నల్లని పూలు, పసుపు పచ్చ పూలు వేయండి. ఈ పువ్వులు నీళ్లు కలిపి రెండు చేతులలో (దోసిలి) తీసుకొని మీ పితృదేవతలకు మూడు సార్లు వాళ్లను మనసారా తలుచుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి (నీళ్లు విడిచిపెట్టేయండి). ఏదైనా వేరే పాత్రలో ఆ నీళ్లు పోసేయ్యండి. ఇక్కడ అమ్మకి నాన్నకి కాదు మీరు విడిచిపెట్టేది, మీ వంశాన్ని బాగు చేస్తున్న మహానుభావులైన పితృదేవతలకు, కాబట్టి అందరం ఆడ, మగ అనే తేడా లేకుండా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఈ తర్పణములు మాత్రం విడిచిపెట్టాలి. పిండప్రదానాలు మాత్రం తల్లిదండ్రులు ఉన్న వాళ్లు చెయ్యకూడదు తప్ప తర్పణములు అందరూ ఇవ్వాలి. ఈ విధముగా అమావాస్య తర్పణములు విడిచిపెట్టాక యథాశక్తిగా ఇష్టదేవతలను పూజించండి. సూర్యుడిని మాత్రం తప్పక పూజించండి. వీలుంటే నవగ్రహాలను తలచుకోండి, నవగ్రహాలకు ప్రదక్షణ చేయండి, నవగ్రహాలకు పూజ చేయండి.
పితృదేవతా స్తోత్రము 👇
https://youtu.be/UgnxFM4YHYY?si=jRPSZaZUj_JlPw7k
శివకేశవ అష్టోత్తరశతనామ స్తోత్రము👇
https://youtu.be/1MoC79bhXT0?si=MCfipiI160MeiZPj
శ్రీ శివ సహస్రనామ స్తోత్రము👇
https://youtu.be/AcS0VMMx3lU?si=Kd8d_ZCZbTfcX0yY
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial