" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 18 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : ఏకాదశి ఈ రోజు ఉదయం 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (19, గురువారం) ఉదయం 09గం౹౹53ని౹౹ వరకు వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : అనూరాధ మధ్యాహ్నం 01గం౹౹41ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : వృద్ధి రాత్రి 02గం౹౹47ని౹౹ వరకు కరణం : బాలవ ఈ రోజు సాయంత్రం 04గం౹౹03ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹48ని౹౹ నుండి 12గం౹౹33ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹01ని౹౹ నుండి 08గం౹౹32ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 04గం౹౹11ని౹౹ నుండి 05గం౹౹42ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹43ని౹౹ 🕉️👉ఏకాదశి👈🕉️ ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం (19న) 09గం౹౹53ని౹౹ లోపు చేయవచ్చును. గురుబోధ భక్తుల స్మరణ చేయడం వల్ల వాళ్ళ సద్గుణాలు మనకు వస్తాయి. అందుకే పెద్దలు ఈ శ్లోకం కంఠస్థం చేసి తరచూ స్మరిస్తూ వారిని తలచుకునేవారు. శ్లో౹౹ ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్ రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాన్ స్మరామి