Jan 17 2026జనవరి 17 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 16 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి రా.10.15 కు తదుపరి చతుర్దశి 17 రా.11.57 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల 17 ఉ.8.38 కు తదుపరి పూర్వాషాఢ 18 ఉ.10.41 కు
యోగం: వ్యాఘాత రా.9:17 కు తదుపరి హర్షణ 17 రా.9:10 కు
కరణం: వణిజ రా.10:22 కు తదుపరి శకుని తె.12:04 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 9.06 - 9.50 కు, మ. 12.47 - 1.32 కు
వర్జ్యం: మ.3.01 - 4.47 కు
అమృతకాలం: తె. 01.13 - 02.59 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.58 కు

🕉️ కనుమ పండుగ, పశువుల పండుగ🕉️

గురుబోధ:
🕉️ కనుమ నాడు కూడా తెల్లవారుజామునే లేవాలి స్నానం చేయాలి, ఈరోజు గోపూజ చేయాలి ఎద్దులను కూడా పూజించాలి. గోపూజ ను మించిన పూజ మరొకటి లేదు. సమస్త దేవతలు గోవులో ఉన్నారు.
🕉️ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రం చెపుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less