Jan 17 2024జనవరి 17 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 17 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : షష్ఠి  తె. 05గం౹౹18ని౹౹ వరకు తదుపరి సప్తమి 18వ తేదీ తె. 03గం౹౹09ని౹౹ వరకు
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ. 09గం౹౹55ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : శివ సా. 05గం౹౹13ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం :  గరజి ఉ. 10గం౹౹58ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹04ని౹౹ నుండి 12గం౹౹49ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹11ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు
అమృతకాలం : రా. 01గం౹౹16ని౹౹ నుండి 02గం౹౹48ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹42ని౹౹కు

👉🕉️ ముక్కనుమ 🕉️👈

గురుబోధ
ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. అట్టివారికి వారి కుటుంబ సభ్యులు లేక ఆప్తులు వారి పేరున భాగవత సప్తాహం జరిపించటమే ఉత్తమ మార్గం. మన పేరు మీద మన పిల్లల పేరు మీద జీవితంలో ఒక్కసారైనా భాగవత సప్తాహం చేయించుకోవడం మంచిది.

భాగవతసప్తాహ వైశిష్ట్యం👇


మంత్ర మహిమ - అగ్నిపురాణం👇


expand_less