" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 16 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : నవమి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹59ని౹౹ వరకు తదుపరి దశమి వారం : ఇందువారం (సోమవారం) నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 02గం౹౹50ని౹౹ వరకు తదుపరి విశాఖ యోగం : ధృతి ఉదయం 10గం౹౹32ని౹౹ వరకు తదుపరి శూల కరణం : తైతుల ఈ రోజు ఉదయం 07గం౹౹39ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ నుండి 03గం౹౹30ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹54ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 05గం౹౹47ని౹౹ నుండి 07గం౹౹36ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹41ని౹౹ 🕉️కనుమ పండుగ🕉️ గురుబోధ గోపూజ ను మించిన పూజ మరొకటి లేదు. సమస్తదేవతలు గోవు లో ఉన్నారు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రం చెబుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది.*