Jan 15 2025జనవరి 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 15 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి తె.3.32 కు తదుపరి విదియ 16 తె.4.41 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి ఉ.11.12 కు తదుపరి ఆశ్లేష 16 మ.12.02 కు
యోగం: విష్కంభ రా.2.58 కు తదుపరి ప్రీతి 16 రా.1.46 కు
కరణం: తైతుల మ.3.17 కు తదుపరి గరజి 16 తె.3.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ.12.03-12.47 కు
వర్జ్యం: రా.12.26-2.05 కు
అమృతకాలం: మ. 12:25 - 1:48 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు

🕉కనుమ పండుగ🕉

గురుబోధ:
గోపూజను మించిన పూజ మరొకటి లేదు. సమస్తదేవతలు గోవులో ఉన్నారు.
ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే కనుమనాడు మాషచక్రాలను అంటే మినుములతో తయారుచేసిన గారెలను భగవంతునికి నివేదన చేసి, కాలభైరవునికి సమర్పించి, తాను తిని ఇతరులకు పెడితే మంచిదని శాస్త్రం చెపుతున్నది. వీలుంటే చెట్లను కూడా పూజించాలి. వృక్షాలను పూజిస్తే కుటుంబం పచ్చగా ఉంటుంది.

https://youtu.be/2Xs9VqOw294?si=i0qIhnb_zAiiUoA2

expand_less