Jan 15 2024జనవరి 15 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 15 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి  ఉ. 09గం౹౹58ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : శతభిషం మ. 01గం౹౹12ని౹౹ వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం : వరీయాన్ రా. 11గం౹౹11ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం :  బవ మ. 03గం౹౹35ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹48ని౹౹ నుండి 01గం౹౹33ని౹౹ వరకు & మ. 03గం౹౹02ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹10ని౹౹ నుండి 08గం౹౹39ని౹౹ వరకు 
అమృతకాలం : ఉ. 06గం౹౹30ని౹౹ నుండి 08గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹41ని౹౹కు

👉🕉️ మకరసంక్రమణం, ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభం 🕉️👈
👉🕉️ ఉత్తరాయణ పుణ్యకాలం - ఉ. 06గం౹౹49ని౹౹ నుండి సా. 06గం౹౹01ని౹౹ వరకు 🕉️👈
👉🕉️ ఉత్తరాయణ మహాపుణ్యకాలం - ఉ. 06గం౹౹49ని౹౹ నుండి ఉ. 08గం౹౹41ని౹౹ వరకు 🕉️👈

గురుబోధ
🕉️సంక్రాంతి పండుగలో రెండవ రోజుకు మకర సంక్రాంతి అని పేరు. ఇది అపూర్వ పుణ్యకాలం సూర్యుడు మేషం మొదలుకొని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకరసంక్రమణం అంటారు.
🕉️లక్ష్మీదేవి ఒకసారి ఇలా అన్నది. సంక్రాంతి నాడు గోపూజ చేసిన వారిని గోక్షీరంతో పాయసం వండి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించిన వారిని, ఆవుపేడతో ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టిన వారిని ,అనుగ్రహిస్తానని చెప్పింది. లక్ష్మీదేవి వాక్కులను శిరోధార్యంగా భావించి ప్రజలు అలా చేసి తరిస్తున్నారు.
🕉️మకరసంక్రమణం రోజున దర్భాసనం పై కూర్చుని లక్ష్మీదేవిని పూజించండి. పూజించేటప్పుడు అమ్మవారికి చెఱకు ముక్కలు చెఱకు పానకం నైవేద్యంగా సమర్పించి తామరపూలతో పూజించినట్లైతే వెంటనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
🕉️సంక్రాంతినాడు శ్రీసూక్త,  హరినామస్మరణ చేసిన హరిదాసుల నెత్తి మీద ఉన్నటువంటి పాత్రలో బియ్యం వేసిన స్వయంపాకం దానం చేసిన వాడు సకల సంపదలు  శుభాలు పొందుతాడు.
🕉️భయంకరమైన శారీరిక రోగములను తగ్గించే శక్తి మకర సంక్రమణం రోజున  గుమ్మడికాయ దానం చేయడం వల్ల కలుగుతుంది. వీలుంటే ముగ్గురు పండితులకు ఇవ్వడం మంచిది. ముగ్గురికి ఇవ్వలేకపోతే శక్తికొలది ఒక్కరికైనా ఇవ్వడం మంచిది.
🕉️మకర సంక్రమణం నాడు సూర్యాస్తమయం అయ్యాక భగవద్గీత వినాలి ఈ రోజున బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం వినాలి లేదా మీ ఇష్టదేవతలకు చెందిన చరిత్రను సూర్యాస్తమయం నాడు వినండి ఈ రోజు పురాణం వింటే సకల దోషాలు నుంచి విముక్తి పొందుతారు.
🕉️శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రాంతి పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము.
 
శ్రీ మహావిష్ణు వేదస్తుతి👇


సంక్రాంతి వైశిష్ట్యం👇


expand_less