Jan 14 2026జనవరి 14 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 14 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి సా.6.03 కు తదుపరి ద్వాదశి 15 రా.8.13 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ 15 తె.3.38 తదుపరి జ్యేష్ఠ 16 తె.6.13 కు
యోగం: వృద్ధి రా.8:37 కు తదుపరి ధ్రువ 15 రా.9:06 కు
కరణం: బాలవ మ.5:53 కు తదుపరి తైతుల రా.8:17 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: మ. 12.02 - 12.47 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 03.22 - 05.10 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.56 కు

🕉️ 2026లో వచ్చు భోగి మరియు సంక్రాంతి వివరణ:🕉️
సూర్య సిద్ధాంతం/ ద్రవిడ సంప్రదాయం ప్రకారం కొన్ని ప్రాంతాల వారు భోగీ పండుగ 13 న చేస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం భోగి 14(బుధవారం) మరియు మకరసంక్రమణ జనవరి 15 (గురువారం), సంక్రమణ జనవరి 14 సాయంత్రం నుండి జనవరి 15, (గురువారం) మధ్యాహ్నం 12.52 గం.ల వరకు ఉంది

గమనిక: ✍️మకర సంక్రమణ జనవరి 14 రాత్రి 08.36నికు నుండి మధ్యాహ్నం వరకు ఉంది. కనుక భోగి పండుగను కొన్ని ప్రాంతాలలో 13 నాడు మరికొన్ని ప్రాంతాలలో 14 నాడు చేసుకుంటున్నారు.
✍️ తర్పణములు ఇవ్వడానికి ఉదయం సమయం ప్రధానంగా తీసుకోవడం చేత మకర సంక్రమణ, సంక్రాంతి పండుగ జనవరి 15(గురువారం) ఆచరించడం జరుగుతున్నది.

గురుబోధ:
మకర సంక్రాంతి అపూర్వ పుణ్యకాలం సూర్యుడు మేషం మొదలుకొని మీనం వరకు వరుసగా 12 రాశులలో ప్రవేశిస్తాడు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన కాలాన్ని మకరసంక్రమణం అంటారు.
1) సంక్రమణం నాడు దర్భాసనం పైన కూర్చుని దేవతారాధన చేస్తే అటువంటివాడు జన్మజన్మల దారిద్ర్యం నుండి విముక్తి పొందుతాడు. దీని గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఒక కథ ఉన్నది.
సంక్రాంతి-పురాణ కథ:
పూర్వకాలంలో ఒక ఆవిడ చాలా కాలం పాటు దాదాపు 40 సంవత్సరముల పాటు కటిక దారిద్ర్యం అనుభవించింది. ఈ దారిద్ర్యం నుండి బయటపడటానికి ఏం చేయాలో తెలియక అదృష్టవశాత్తు వచ్చిన అగస్త్యమహర్షి కాళ్లు పట్టుకుని దారిద్ర్యము అనుభవిస్తున్నాను సంపదలు రావాలంటే ఏం చేయాలండి అని అడిగింది. అందుకు అగస్త్యుడు సంక్రాంతి నాడు స్నానం చేసి దర్భలతో తయారుచేసిన చాప మీద కూర్చో, లక్ష్మీదేవిని పూజించి లక్ష్మికి చెఱకుగడలు, పానకము ఈ రెండు నైవేద్యంగా పెట్టు, తామరపువ్వులతో పూజించు, నీ దారిద్ర్యం పోతుంది అన్నాడు ఆవిడ అలాగే చేసింది. అమ్మ ప్రత్యక్షమై ఈ సంక్రాంతి నాడు నేను పౌష్యలక్ష్మి అనే పేరుతో తిరుగుతూ ఉంటాను, ఈ సమయంలో నన్ను పూజించావు కనుక నీకు దారిద్ర్యం తొలగించి సంపదలు కలిగిస్తున్నాను అన్నది.
ఆచరించాల్సిన విధి విధానాలు – సత్ఫలితాలు:
1) మకర సంక్రమణం రోజున దర్భాసనం పై కూర్చుని లక్ష్మీదేవిని పూజించండి పూజించేటప్పుడు అమ్మవారికి చెఱకు ముక్కలు, చెఱకు పానకం నైవేద్యంగా సమర్పించి తామరపూలతో పూజించినట్లైతే వెంటనే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
2) పిల్లలు లేని వాళ్ళు ఈ సంక్రమణం రోజున ఆవుపాలతో వండిన పాయసాన్ని అమ్మకు నైవేద్యంగా చేసి తాము తిని పది మందికి పంచి పెడితే సత్సంతానం కలుగుతుంది. ఈ రోజు పిల్లలకు ప్రసాదం పెట్టిన వాళ్లు సత్సంతానం పొందుతారు, అప్పటికే సంతానం కలిగిన వారైతే ఆ సంతానానికి సద్బుద్ధి చేయగలిగిన వారు అవుతారు.
3) సంక్రాంతినాడు శ్రీసూక్త, హరినామస్మరణ చేసిన హరిదాసుల నెత్తి మీద ఉన్నటువంటి పాత్రలో బియ్యం వేసిన స్వయంపాకం దానం చేసిన వాడు సకల సంపదలు శుభాలు పొందుతాడు.
4) అనారోగ్యం నుండి బయటపడడానికి సాంబుడు అనే వాడు ఈ పని చేశాడు. ఈయన శ్రీకృష్ణ జాంబవతులకు పుత్రుడు. ఆయనకు ఒకసారి కుష్ఠరోగం వచ్చింది. ఈ కుష్ఠరోగం నుండి బయటపడడానికి నారదుని సలహా మీద మకర సంక్రమణం రోజు మహాలక్ష్మిని పూజించాడు. పూజించిన తర్వాత మూడు అరటి ఆకులు తీసుకువచ్చి మూడు అరిటాకులు విడివిడిగా పెట్టి దాని మీద బియ్యం కూరలు ఉప్పు పప్పు అన్నీ పెట్టాడు. ఆ మూడు ఆకుల మీద మూడు గుమ్మడి కాయలు పెట్టాడు. స్వయంపాకంతో పాటు ఈ గుమ్మడికాయలని గర్గాచార్యులవారికి, దుర్వాసమహర్షి, విశ్వామిత్రమహర్షికి ఇచ్చాడు. ఆ ముగ్గురికి దానిని ఇవ్వడంతో టక్కున అతనికున్న కుష్ఠరోగం పోయింది. అందమైన శరీరం వచ్చింది.
5) భయంకరమైన శారీరిక రోగములను తగ్గించే శక్తి మకర సంక్రమణం రోజున గుమ్మడికాయ దానం చేయడం వల్ల కలుగుతుంది. వీలుంటే ముగ్గురు పండితులకు ఇవ్వడం మంచిది. ముగ్గురికి ఇవ్వలేకపోతే శక్తికొలది ఒక్కరికైనా ఇవ్వడం మంచిది.
6) మకర సంక్రమణం నాడు సూర్యాస్తమయం అయ్యాక భగవద్గీత వినాలి. ఈ రోజున బ్రహ్మవైవర్త పురాణం, భాగవతం వినాలి లేదా మీ ఇష్టదేవతలకు చెందిన చరిత్రను సూర్యాస్తమయం నాడు వినండి ఈ రోజు పురాణం వింటే సకల దోషాలు నుంచి విముక్తి పొందుతారు.

https://youtu.be/QBQNDt0i-_8?si=huW0YgbJhYvBqu9C

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less