కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 14 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: పూర్ణిమ తె.5.53 కు తదుపరి పాడ్యమి 15 తె.3.32 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పునర్వసు ఉ.10.52 కు తదుపరి పుష్యమి 15 ఉ.11.12 కు
యోగం: వైధృతి తె.4.38 కు తదుపరి విష్కంభ 15 రా.2.58 కు
కరణం: బవ తె.3:56 కు తదుపరి బాలవ సా.3:34 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.9.06-9.50 కు & రా.11.07-11.59 కు
వర్జ్యం: రా.6.58-8.35 కు
అమృతకాలం: మ. 12:25 - 1:48 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
🕉️మకర సంక్రాంతి, ఉత్తరాయణం పుణ్య కాలం ప్రారంభం - ఉదయం 11గం౹౹00ని౹౹ల నుండి మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ వరకు🕉️
గురుబోధ:
సంక్రమణ సమయంలో చేసిన పూజ, అభిషేకం, జపం వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది అని శాస్త్రం* మకర సంక్రమణం నాడు తప్పక సూర్యునికి పరమాన్నము నేవేదించాలి.
ముఖ్యంగా ఈ రోజు శివలింగానికి ఆవు నేతితో అభిషేకం, దర్భాసనంపై జపం, పులిహోర, పరమాన్నం సూర్యునికి నైవేద్యం పెట్టడం, గోవులకు ప్రదక్షిణ, గోసేవ, స్వయంపాకం, చెఱకుగడ వంటివి దానం చేయడం మంచిది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial