"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 14 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము
తిథి : తదియ మ. 12గం౹౹20ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : ధనిష్ఠ మ. 02గం౹౹51ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : సిద్ధి ఉ. 06గం౹౹23ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం : గరజి ఉ. 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹33ని౹౹ నుండి 11గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 06గం౹౹31ని౹౹ నుండి 08గం౹౹01ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹40ని౹౹కు
👉🕉️ భోగి 🕉️👈
గురుబోధ
భోగినాడు తలంటుకొని స్నానం చేస్తారు. మాడు పై తైలం మర్దన చేసి, కుంకుడు కాయల రసంతో తలనంటుకుని, వేడి నీటితో స్నానం చేస్తే తల శుద్ధి అవుతుంది. అప్పుడు ధ్యానం తనంత తానుగా సాగుతుంది. యోగచైతన్యం అన్ని చక్రాలనూ శుద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియలో శరీరానికి కూడా వేడి తగలాలి. అందువల్లనే భోగిమంట వేసుకుని, శిరఃస్నానానంతరం కొంతసేపు శరీరాన్ని కాచుకునేవారు. భోగినాడు ఆవుపాలు, ఆవునేయి, ఆవుపెరుగు దానం చేసిన వారికి స్వర్గం లభిస్తుందనీ, దారిద్ర్యం తొలగి ఆరోగ్యం లభిస్తుందనీ సౌరసంహిత చెపుతున్నది. ఈనాడు గుమ్మడికాయను దానంచేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది.
భోగి పూజావిధానం👇