Jan 13 2026జనవరి 13 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 13 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం

తిథి: దశమి మ.3.55 కు తదుపరి ఏకాదశి 14 సా.6.03 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ రా.1.02 కు తదుపరి అనూరాధ 15 తె.3.38 కు
యోగం: గండ రా.7:55 కు తదుపరి వృద్ధి 14 రా.8:37 కు
కరణం: విష్టి మ.3:18 కు తదుపరి బాలవ సా.5:53 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 9.05 - 9.50 కు, రా. 11.07 - 11.58 కు
వర్జ్యం: తె.5.28 - ఉ.7.15 కు
అమృతకాలం: మ. 02.15 - 04.03 కు
సూర్యోదయం: ఉ. 6.53 కు
సూర్యాస్తమయం: సా. 5.56 కు
🕉️ 2026లో వచ్చు భోగి మరియు సంక్రాంతి వివరణ:🕉️
సూర్య సిద్ధాంతం/ ద్రవిడ సంప్రదాయం ప్రకారం కొన్ని ప్రాంతాల వారు భోగీ పండుగ 13 న చేస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం భోగి 14(బుధవారం) మరియు మకరసంక్రమణ జనవరి 15 (గురువారం), సంక్రమణ జనవరి 14 సాయంత్రం నుండి జనవరి 15, (గురువారం) మధ్యాహ్నం 12.52 గం.ల వరకు ఉంది

గమనిక: ✍️మకర సంక్రమణ జనవరి 14 రాత్రి 08.36నికు నుండి మధ్యాహ్నం వరకు ఉంది. కనుక భోగి పండుగను కొన్ని ప్రాంతాలలో 13 నాడు మరికొన్ని ప్రాంతాలలో 14 నాడు చేసుకుంటున్నారు.
✍️ తర్పణములు ఇవ్వడానికి ఉదయం సమయం ప్రధానంగా తీసుకోవడం చేత మకర సంక్రమణ, సంక్రాంతి పండుగ జనవరి 15(గురువారం) ఆచరించడం జరుగుతున్నది.

గురుబోధ:
1) పుష్యమాసంలో వైకుంఠం నుంచి లక్ష్మీదేవి భూలోకమునకు వచ్చి 3 రోజుల పాటు భక్తులను అనుగ్రహిస్తుంది. ఆ మూడురోజులే వరుసగా భోగి, మకర సంక్రాంతి, మూడవది రైతులకు ఆనందాన్ని ప్రసాదించే కనుమ పండుగ.
2) లక్ష్మీ దేవి మూడు రూపములలో మొదటి రూపం ‘భోగి’ అనే రూపంలో ఉన్నది. రెండవ రూపం ‘సంక్రాంతి’ లక్ష్మీస్వరూపంలో ఉన్నది. మూడవది ‘కర్షక లక్ష్మి’. ఆ కర్షక శబ్దమే తెలుగులో కనుమ అయ్యింది.
3)‘భోగం ఆస్థి ఇతి భోగి'. భోగము అంటే పాము పడగ, పాము తన శరీరాన్ని చుట్టచుట్టుకుని ఉండడాన్ని కూడా భోగము అని అంటారు. ప్రధానంగా పాముపడగను భోగము అంటారు.
4)పూర్వము ఆదిశేషుడు వేయిపడగలతో శ్రీమహావిష్ణువుకి పానుపు అయి మోసాడు. ఈ పర్వదినాన్ని భోగము అంటారు.
5)ఆ విష్ణువులో ఉన్న ఒక దివ్య అంశ ఆదిశేషుడు లేక అనంతుడు అనే పేరుతో అవతరించి వేయిపడగలు ధరించి చుట్టలు చుట్టుకొని మహావిష్ణువును మోయటం ప్రారంభించిన తిథి భోగి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less