కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 13 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: చతుర్దశి ఉ.6.50 కు తదుపరి పూర్ణిమ 14 తె.5.53 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర ఉ.11.00 కు తదుపరి పునర్వసు 14 ఉ.10.52 కు
యోగం: ఐంద్ర ఉ. 06:44 కు తదుపరి వైధృతి 14 తె.4.38 కు
కరణం: వణిజ తె.5.03 కు తదుపరి విష్టి సా.4.26 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.46-1.31 కు & మ.2.59-3.43 కు
వర్జ్యం: రా.10.50-12.30 కు
అమృతకాలం: మ. 1:47 - 3:10 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
🕉️ భోగి పండుగ, ఆరుద్రోత్సవం 🕉️
గురుబోధ:
🕉️ ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున శివలింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు, శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు. ఈ రోజు సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి), ఈ రెండు రోజులూ శివునికి అత్యంత ప్రీతికరం.
ద్రవిడ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రానక్షత్రము నాడు ఆరుద్రోత్సవం (ఆరుద్ర దర్శనం- జనవరి 13, 2025) జరుపుతారు.
🕉️ భోగినాడు తలంటుకొని స్నానం చేస్తారు. మాడు పై తైలం మర్దన చేసి, కుంకుడు కాయల రసంతో తలనంటుకుని, వేడి నీటితో స్నానం చేస్తే తల శుద్ధి అవుతుంది. అప్పుడు ధ్యానం తనంత తానుగా సాగుతుంది. యోగచైతన్యం అన్ని చక్రాలనూ శుద్ధి చేస్తుంది. ఈ ప్రక్రియలో శరీరానికి కూడా వేడి తగలాలి. అందువల్లనే భోగిమంట వేసుకుని, శిరఃస్నానానంతరం కొంతసేపు శరీరాన్ని కాచుకునేవారు. భోగినాడు ఆవుపాలు, ఆవునేయి, ఆవుపెరుగు దానం చేసిన వారికి స్వర్గం లభిస్తుందనీ, దారిద్ర్యం తొలగి ఆరోగ్యం లభిస్తుందనీ సౌరసంహిత చెపుతున్నది. ఈనాడు గుమ్మడికాయను దానంచేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశాభివృద్ధి అవుతుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial