Jan 13 2024జనవరి 13 2024favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 జనవరి 13 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము

తిథి : విదియ  మ. 02గం౹౹29ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : శ్రవణం సా. 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : వజ్ర మ. 02గం౹౹05ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం :  కౌలవ ఉ. 11గం౹౹11ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹49ని౹౹ నుండి 08గం౹౹06ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹07ని౹౹ నుండి 09గం౹౹37ని౹౹ వరకు 
అమృతకాలం : ఉ. 06గం౹౹35ని౹౹ నుండి 08గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు

👉🕉️ రెండవ దత్తావతారం అయినటువంటి శ్రీ గురు నరసింహ సరస్వతీ స్వామి వారి జన్మతిథి - పుష్యమాసంలో ద్వితీయ తిథి 🕉️👈

గురుబోధ
అద్భుతమైన దత్తాత్రేయ వజ్రకవచం నిత్యం వినాలి. ఒక 40 రోజుల పాటు పారాయణం చేస్తే దత్తాత్రేయుడు మీ ఇంట్లో కొలువుంటాడు. ఇది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి, దలాదునికి గోపీకుండం దగ్గర చెప్పాడు. ఇలా చెబుతుండగా దూరశ్రవుడు అనే ఒక బోయవాడు (భిల్లుడు) వినడంతో అతనికి సమస్త పాపపరిహారమై శాశ్వత వైకుంఠం లభించింది. అంతటి అపూర్వ శక్తిమంతమైన కవచం ఇది.
లక్ష్మీ దేవి మూడు రూపములలో ఉన్నది మొదటి రూపం ‘భోగి’ అనే రూపంలో ఉన్నది రెండవ రూపం ‘సంక్రాంతి’ లక్ష్మీ స్వరూపం లో ఉన్నది మూడవది ‘కర్షక లక్ష్మి’ ఆ కర్షక శబ్దమే తెలుగులో కనుమ అయ్యింది.
 
దత్తాత్రేయ వజ్రకవచం👇


దత్తాత్రేయ స్తోత్రం👇


expand_less