" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 13 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : షష్ఠి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹02ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఉత్తర మధ్యాహ్నం 01గం౹౹10ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : శోభన ఉదయం 12గం౹౹46ని౹౹ వరకు తదుపరి అతిగండ కరణం : వణిజ ఈ రోజు సాయంత్రం 06గం౹౹17ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹50ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 09గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 05గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹11ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹40ని౹౹ గురుబోధ* సంక్రాంతి (మకర సంక్రమణం) పండుగలో మొదటిరోజైన భోగినాడు తెల్లవారుజామున లేచి తలకు నువ్వులనూనె పెట్టుకొని అభ్యంగస్నానం చేయాలి. మన శరీరంలో యోగశక్తికి ప్రతీక అయిన కుండలినీశక్తి జాగృతమై ఆధ్యాత్మిక సాధనకు అనువైన రోజే భోగి. సంక్రాంతి సందర్భంగా సాయంత్రం పూట చేసే గోపూజ, గోప్రదక్షిణ భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని, ఒకేసారి లక్ష సంవత్సరములు తపస్సు చేసిన మహా ఫలితాన్ని లభింపజేస్తుంది.