"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 12 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు పుష్యమాసం శుక్లపక్షము
తిథి : పాడ్యమి సా. 04గం౹౹30ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ సా. 05గం౹౹44ని౹౹ వరకు తదుపరి శ్రవణం
యోగం : హర్షణ మ. 02గం౹౹05ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం : కౌలవ ఉ. 11గం౹౹11ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹03ని౹౹ నుండి 09గం౹౹48ని౹౹ వరకు & మ. 12గం౹౹47ని౹౹ నుండి 01గం౹౹31ని౹౹ వరకు
వర్జ్యం : రా. 09గం౹౹30ని౹౹ నుండి 11గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹37ని౹౹ నుండి 01గం౹౹08ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు
👉🕉️ పుష్యమాసం ప్రారంభం 🕉️👈
గురుబోధ
ఈ మాసంలో మకరసంక్రమణం ఏర్పడుతుంది. దేవతలకు ప్రీతిపాత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుక ఈ మాసము దేవమాసంగా కూడా పిలుస్తారు. పుష్యమాసం యోగులకు ప్రధానమైనది. ఈ మాసంలో యోగాభ్యాసం చేసేవారికి కుండలినీ శక్తి ప్రస్ఫుటమవుతుంది.