కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 11 2026 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి మ.12.22 కు తదుపరి నవమి 12 మ.1.58 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: చిత్ర రా.8.25 కు తదుపరి స్వాతి 12 రా.10.35 కు
యోగం: ధృతి సా.6:11 కు తదుపరి శూల 12 రా.7:04 కు
కరణం: కౌలవ ఉ.10:20 కు తదుపరి తైతుల రా.11:29 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.26 - 5.10 కు
వర్జ్యం: రా.2.31 - 4.15 కు
అమృతకాలం: ఉ. 11.06 - 12.52 కు
సూర్యోదయం: ఉ. 6.52 కు
సూర్యాస్తమయం: సా. 5.55 కు
గురుబోధ:
పవిత్ర దినం సంక్రాంతి నాడు గుమ్మడికాయను దానం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. వంశ అభివృద్ధి జరుగుతుంది.
మకర సంక్రాంతి -ఇతిహాస కథ: 1) మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో ఒక కథ ఉన్నది. ఒకప్పుడు శ్రీమహాలక్ష్మి భూలోకమంతా తిరుగుతూ చివరికి ఇంటికి వెళ్లి ఎవరిని అనుగ్రహించాలని చూసింది కానీ ఆమెకు ఏ గృహము నచ్చలేదు. ఆ తల్లి ఒక గోశాల వద్దకు వెళ్ళింది లోనికి వెళ్ళబోయింది అప్పుడు గోవులు మీరెవరు అని ప్రశ్నించాయి తాను విష్ణుపత్ని అని వివరించింది. అయితే మా గోశాల లోపలకి నీవు రావద్దని గోవులు అన్నాయి, లక్ష్మీ తెల్లబోయింది, అప్పుడు గోవులు లక్ష్మితో ఇలా అన్నాయి. నీవు చంచలత్వం గలదానివి ఎక్కడా స్థిరంగా ఉండవు. పైగా నీ గృహములలో సంపదలలో నివసిస్తావు. అందువల్లనే మా గృహములోకి రావద్దు అన్నాయి. అప్పుడు లక్ష్మి గోవులతో ఇలా అన్నది ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోలోకంలో రాధతో గోవుల తిరస్కారానికి గురి అయిన వారికి ముఖ్యంగా దేవతలకు పూజార్హత ఉండదు అని అన్నాడు. ఇప్పుడు మీరేమో నన్ను వద్దంటున్నారు అనగా గోవులు లక్ష్మికి వినయంతో నమస్కరించి, ఇలా అన్నాయి అమ్మా! నువ్వు జగదంబవి నీకు పూజార్హత ఇచ్చే శక్తి మాకు ఎక్కడిది? మేము త్వరపడి రావద్దు అన్నందుకు మమ్మల్ని క్షమించు నీ కోరికలను మన్నిస్తూ ఉన్నాము. ఈనాటి నుండి మా మూత్రములో, పేడలో, పాలల్లో, గిట్టల్లో, గిట్టల్లో నుండి వచ్చే ధూళిలో మా శరీరములలో నీవు నివసించు మమ్ము పూజించేవారికి సంపదలు అందించు అన్నాయి. ఆనాటి నుండి శ్రీలక్ష్మి గోవులు ప్రసాదించిన ఆ శరీర ప్రదేశాల్లో, గోమూత్రము, గోమయములో నివసించడం మొదలుపెట్టింది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial