కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 11 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి ఉ.8.06 కు తదుపరి త్రయోదశి 12 ఉ.7.13 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రోహిణి మ.12.28 కు తదుపరి మృగశిర 12 ఉ.11.33 కు
యోగం: శుక్ల ఉ. 11:48 కు తదుపరి బ్రహ్మ 12 ఉ. 08:09 కు
కరణం: బాలవ ఉ.8.21 కు తదుపరి కౌలవ రా.7.26 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.21-9.05 కు
వర్జ్యం: సా.5.51-7.22 కు
అమృతకాలం: ఉ.6.52 - 08.15 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శనివారం ఉదయం 08 గం.ల లోపు చేయాలి.
🕉శని త్రయోదశి & శ్రీ లాల్ బహద్దూర్ శాస్త్రి స్మృతిదివసం🕉
గురుబోధ:
శని త్రయోదశి రోజు శని భగవానుడికి తైలాభిషేకం, ప్రదక్షిణలు, అర్చన, జపం, స్తోత్ర పారాయణ చేయడం వలన సమస్త దోషాలు తొలగి విశేష ఫలితము ఇస్తుంది. ఈ రోజు శనిస్తోత్రం, పిప్పలాద కృత శనిస్తోత్రం లేదా దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయడం వలన అనేక శుభ ఫలితములు పొందుతారని శివపురాణం చెపుతోంది.
https://youtu.be/97Q4_4k_hH4?si=VI0hZUtn2kbpswYs