" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 జనవరి 11 2023 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షము తిథి : చతుర్థి ఈ రోజు ఉదయం 11గం౹౹32ని౹౹ వరకు తదుపరి పంచమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : మఘ ఉదయం 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : అయుష్మాన్ ఉదయం 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹31ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 11గం౹౹46ని౹౹ నుండి 12గం౹౹30ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 06గం౹౹14ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹45ని౹౹ వరకు & తెల్లవారి 04గం౹౹34ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹39ని౹౹ గురుబోధ శ్రీ త్యాగరాజ స్వామి వారి నిత్య పారాయణ గ్రంథం పోతనగారి శ్రీమద్ భాగవతం. త్యాగరాజస్వామికి గొప్ప బహుమానం ఇవ్వాలని తన ప్రియ శిష్యులలో ఒకరు శ్రీ పోతన భాగవతాన్ని మొత్తం స్వయంగా వ్రాసి బహూకరించాడు. త్యాగరాజాస్వామికి పోతన భాగవతం అంటే అంత ఇష్టం. అటువంటి గొప్ప గ్రంథాలని నిత్యం మనం కూడా పారాయణం చేయడం వల్ల భగవంతునికి మరింత దగ్గర అవుతాము.