కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 10 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి ఉ.10.07 కు తదుపరి ద్వాదశి 11 ఉ.8.06 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: కృత్తిక మ.2.03 కు తదుపరి రోహిణి 11 మ.12.28 కు
యోగం: శుభ మ.2.36 కు తదుపరి శుక్ల 11 ఉ. 11:48 కు
కరణం: వణిజ రా.11:21 కు తదుపరి విష్టి 11 ఉ.10.20 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.9.05-9.49 కు & మ.12.45-1.29 కు
వర్జ్యం: తె.5.00-6.30 కు
అమృతకాలం: ఉ.9:37-11:00 కు
సూర్యోదయం: ఉ. 6:52 కు
సూర్యాస్తమయం: సా. 5:53 కు
🕉️వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి)/త్రైలింగస్వామి జయంతి🕉️
గురుబోధ:
🕉️ అన్ని వ్రతముల కన్నా ఏకాదశీ వ్రతం చాలా గొప్పది. అందునా వైకుంఠ ఏకాదశి మరింత గొప్పది. తప్పక ఈ రోజు తగినవిధంగా జపం, పురాణ శ్రవణం, ఉపవాసం చేయాలి.
🕉️ ఏకాదశీ పర్వదినం నాడు ఏదో ఒక విష్ణువుకి సంబంధించిన ఆలయాన్ని దర్శించుకోవాలి. ఏకాదశి నాడు ఆవునేతి దీపం వెలిగిస్తే లక్ష యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం, హరినామస్మరణం, స్వయంపాకం దానం మంచిది. అన్నం బదులు ఫలహారం కానీ ఉప్పుడుపిండి కానీ స్వీకరించాలి. పగటినిద్ర పనికిరాదు. గురుదర్శనం, గురుప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం.
వాసుదేవ శతనామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=FHDm4G0cVcGOAu7V