"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 10 2024 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము
తిథి : చతుర్దశి రా. 07గం౹౹38ని౹౹ వరకు తదుపరి అమావాస్య
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : మూల రా. 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం : ధ్రువ రా. 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం : విష్టి ఉ. 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి శకుని
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹01ని౹౹ నుండి 12గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹52ని౹౹ నుండి 06గం౹౹25ని౹౹ వరకు & రా. 06గం౹౹00ని౹౹ నుండి 07గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం : మ. 01గం౹౹19ని౹౹ నుండి 02గం౹౹53ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹38ని౹౹కు
👉🕉️ మాసశివరాత్రి 🕉️👈
గురుబోధ
శివసహస్రనామం ఒక అద్భుతమైన అస్త్రం వంటిది. బ్రహ్మాస్త్రం కంటే పాశుపతాస్త్రం కంటే, నారాయణాస్త్రం కంటే గొప్పది."సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం" సకల వేదాలూ చదవడం వల్ల వచ్చే ఫలితం,సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, అనేక యజ్ఞములు, దానములు చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం శివసహస్రనామాన్ని చదవడం వల్ల, వినడం వల్ల పొందవచ్చును. అందుకే దీనికి సాటి వచ్చే స్తోత్రం లేదన్నారు. స్వయముగా ఆనుశాసనిక పర్వంలో శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మరాజుగారికి అందించినటువంటి అపూర్వ స్తోత్రం ఇది.
శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇